మద్యం అమ్మకాలు, నివారణ చర్యలపై సమావేశం
1 min read– తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల మద్యం కర్నూలు జిల్లాకు రాకుండా చర్యలు తీసుకోవాలి…
– జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు…
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల మద్యం కర్నూలు జిల్లాకు రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు అబ్కారి శాఖ, సెబ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు జిల్లా అబ్కారి శాఖ, సెబ్ అధికారులతో ఇతర రాష్ట్రాల నుండి మద్యం అమ్మకాలు, నివారణ చర్యలపై విపులంగా చర్చించారు.అబ్కారి శాఖ అధికారులు మాట్లాడుతూ మద్యం తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి బార్డర్ దాటి కర్నూలు జిల్లాలో దొంగతనం గా తెచ్చి అమ్మకాలు జరుగుతున్నాయని , దాదాపు పది సంవత్సరాల నుండి అబ్కారి శాఖలో క్రొత్తగా ఉద్యోగాలు భర్తీ చేయలేదని సిబ్బంది కొరత వల్ల సరైన చర్యలు తీసుకోలేక పోతున్నామని ఎక్సైజ్ సూపరింటెన్డెంట్ జి. నాగేశ్వరరావు తెలియజేశారు.ఈ సందర్భంగా సెబ్ అధికారులు మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలు కేవలం 15 కిలోమీటర్లు దూరంలో మాత్రమే ఉండడము వలన రోడ్డు మార్గాన మరియు తుంగభద్ర నది సంవత్సరంలో దాదాపు 8 నెలలు ప్రవాహం ఉండదని ఆ సమయంలో కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి మద్యం నది దాటుకుని నడక ద్వారా కర్నూలు జిల్లా లో వస్తున్నదని , అక్కడ నిఘా వేసి స్వాధీనం చేసుకుంటున్నామని తెలియజేశారు. తెలియజేశారు. జిల్లా ఎక్సైజ్ సూపర్ ఇండెంట్/ఏపీ బీసీఎల్ మేనేజర్ జి.నాగేశ్వరరావు మరియు ఏపీ బీసీఎల్ అసిస్టెంట్ మేనేజర్ రాముడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాల మేరకు అన్ని ప్రాంతాలకు మద్యం సరఫరా చేస్తున్నామని , ధరలు ప్రభుత్వం ఆదేశాల మేరకే నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు.ఈ సమావేశంలో చర్చించిన విషయాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే మద్యాన్ని అరికట్టే దిశగా కార్యాచరణ రూపొందించుకుందామని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు తెలియజేశారు.ఈ సమావేశానికి అబ్కారి శాఖ మరియు సేబ్ అధికారులు పాల్గొన్నారు.