మద్యం షాపులు.. పాలప్యాకెట్ల కంటే అత్యవసరమా..?
1 min read
పల్లెవెలుగు వెబ్: రాష్ట్రంలో పాల పాకెట్ల కంటే ముందే మద్యం షాపులు తెరుస్తున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ విమర్శించారు. మద్య నిషేధం చేస్తామని చెప్పిన జగన్.. మద్యం షాపులు తెరిచే టైమింగ్స్ మార్చారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలకు పాల ప్యాకెట్లు అవసరమా.. మద్యం షాపులు అవసరమా ? అని ప్రశ్నించారు. మద్యం షాపుల ద్వార ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఆక్సిజన్ అందక అల్లాడుతుంటే.. ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం దారుణమని అన్నారు.