అనంతలో లిథియం ఖనిజం.. జీఎస్ఐ గుర్తింపు !
1 min readపల్లెవెలుగువెబ్ : అత్యంత అరుదైన ఖనిజం లిథియం. లిథియం ఖనిజ నిక్షేపాలు అనంతపురం జిల్లాలోని తాడిమర్రి మండలం తురకవారిపల్లి, దాడితోట గ్రామాల్లో ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేలో గుర్తించారు. ఎస్ఐ శాస్త్రవేత్తలు కొన్ని నెలల క్రితం జిల్లాలోని తాడిమర్రి మండలం తురకవారిపల్లె, దాడితోట ప్రాంతాలతో పాటు సమీపంలోని వైఎస్సార్ జిల్లా పార్నపల్లె, లోపటనూతల ప్రాంతాల్లో ఫీల్డ్ సర్వే చేశారు. ఈ ప్రాంతాల్లోని మట్టి, శిలలు, ప్రవాహ అవక్షేపాలను సేకరించి పరీక్షించారు. 18 పీపీఎం నుంచి 322 పీపీఎం మోతాదులో లిథియం నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ ఖనిజాన్ని రీచార్జ్బుల్ బ్యాటరీలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డిజిటల్ కెమెరాలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఎక్కువగా వాడుతున్నారు. అంతేకాకుండా గుండెకు అమర్చే పేస్మేకర్ల తయారీలోనూ వినియోగిస్తున్నారు.