రోడ్లపై చెత్త వేశారో.. ఫైన్ తప్పదు..
1 min readసీసీ కెమెరాల ఏర్పాటుతో.. తప్పించుకునే
– వ్యర్ధాల బ్లాక్ స్పాట్స్ తొలగింపుపై వినూత్న ఆలోచనలో నగర పాలక అధికారులు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు నగరంలో బాధ్యతారహితంగా రహదారులపై చెత్తను పారబోస్తూ వ్యర్ధాల బ్లాక్ స్పాట్స్ గా మారుస్తున్న వారిపై నగర పాలక అధికారులు డేగ కన్నువేశారు. నగరంలో పూర్తిస్థాయిలో ఇంటింటి చెత్త సేకరణ ప్రక్రియ జరుగుతున్నా…పారిశుద్ధ్య కార్మికులకు చెత్త ను ఇవ్వకుండా.. రోడ్లపై పారబోస్తున్న వారిని గుర్తించడానికి అక్కడే ఉన్న ఇళ్లకు కానీ దుకాణాలకు సీసీ కెమెరాలను అమర్చి అలాంటి వారిని గుర్తిస్తున్నారు. బుధవారం స్థానిక అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ వద్ద కూడా ఇలా వ్యవహరిస్తున్న ప్రాంతంలో ఉన్న ఒక దుకాణానికి ఒక సీసీ కెమెరాను అమర్చారు. అక్కడ చెత్త వేసే వారిని గుర్తించి వారికి జరిమానా విధించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులును కమిషనర్ డీకే బాలాజి ఆదేశించారు. అనంతరం సెంట్రల్ ప్లాజా వద్ద శ్రీచైతన్య పాఠశాల హెడ్ మాస్టర్ కూడా కమిషనర్ బాలాజీ పాత రవి థియేటర్ వద్ద ఎక్కువ శాతం పాఠశాలకు సంబంధించిన వ్యర్ధాల ఉన్నాయని వాటి ద్వారా అక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుందని తెలియజేశారు. కేవలం నగర పాలక పారిశుద్ధ్య కార్మికులకే ఇవ్వాలని వారికి విషధికరించారు. నగర పాలక డిప్యూటీ కమిషనర్ పద్మావతి, హెల్త్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు రవి, శ్రీనివాసులు ఉన్నారు.