`సుప్రీం`లో లైవ్ స్ట్రీమ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : సుప్రీంకోర్టు కార్యకలాపాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు జరుగుతుండగా, సాంకేతిక పరిజ్ఞానంలో ఇంకో ముందడుగు పడనుంది. కోర్టు కార్యకలాపాలు ఇకపై లైవ్ స్ట్రీమ్ కానున్నాయి. ఇందుకు ప్రత్యేకంగా సొంత ప్లాట్‌ఫారం ఏర్పాటుకానుంది. సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా సమాచార హక్కు పరిధిలోకి తీసుకురానుండడం మరో ముఖ్యమైన అంశం. ప్రస్తుతం కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాల కోసం యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారని, ఇది సరైన విధానం కాదని పేర్కొంటూ బీజేపీ మాజీ నాయకుడు కె.ఎన్.గోవిందాచార్య దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ జె.బి.పార్డీవాలాల ధర్మాసనం పరిశీలించింది.