PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పురాతన చరిత్రకు సజీవ సాక్ష్యం…

1 min read

– ఆదిమానవుడి అడుగులకు ఆనవాళ్ళు రాతి చిత్రాలు

పల్లెవెలుగు వెబ్​, గడివేముల: ఆధునిక జీవితంలో మన చుట్టుపక్కల ఉన్న పురాతన చరిత్రను పట్టించుకోవడానికి సమయం లేకపోవడం ఉన్న కాపాడుకోలేక పోవడానికి నిదర్శనం గడివేముల మండలంలోని పురాతన సంస్కృతికి సజీవ సాక్ష్యం దుర్గ భోగేశ్వర స్వామి పరిసరాల్లో బొమ్మల గుడు వద్దా ఆదిమానవుడు గుహల్లో చిత్రీకరించిన బొమ్మలే ఆధారం అలాగే జనమేయ మహారాజు పాలించిన కాలంలో శిలా శాసనాలు ఇప్పటికీ గడిగరేవుల గ్రామ శివారులో ఉండడం గమనార్హం.  

రెండు నెలల క్రింద చరిత్రకారులు పెరుగు శివ కృష్ణ యాదవ్ డాక్టర్ యాదవ్ రఘు సత్య సాయి యూనివర్సిటీ కల్బుర్గి కర్ణాటక సంయుక్తంగా చేపట్టిన పరిశోధనలో ఫై బొగ్గుల గ్రామ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1500 ఏళ్ల క్రితం ఆదిమానవుడు సంచరిస్తూ గుహల్లో గీసిన రాతి చిత్రాలను కనుగొనడం జరిగింది.  డిసెంబర్ 28వ తేదీ ద హిందూ ఇంగ్లీష్ పత్రికలో ఆర్టికల్ కూడా వచ్చింది స్వయంగా వెళ్లి చూసిన నాకు ఆశ్చర్యకరమైన రీతిలో ఆదిమ కాలంలో మానవుడు సృష్టించిన కుడ్య చిత్రాలను తిలకించడం స్థానిక తలారి సుధాకర్ సహాయంతో గ్రామానికి రెండు కిలోమీటర్లు దూరంలో లోయ ప్రాంతంలో ఉన్న ఈ చిత్రాలను కొందరు ధ్వంసం చేసినట్టు  వీటిని ప్రాచీన పురాతత్వశాఖ వారు కాపాడాలని స్థానికులు మండల వాసులు కోరుతున్నారు. మనిషి మేధస్సు ఎంత పెరిగిన గతంలోను తాము పాటించిన ఆచారాలు ఆహార్యం కొట్టొచ్చినట్టుగా రాతి మీద చిత్రాలను వేయడం వారి మేధస్సుకు నిదర్శనం ఇప్పటికైనా సంస్కృతికి చెందిన ఎన్నో పురాతన అవశేషాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

About Author