PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎల్ ఎల్ సి ఆయకట్టును స్థిరీకరించాలి

1 min read

– గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు తాగునీరు అందించాలి: రాయలసీమ విద్యావంతుల వేదిక
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : ఎల్ఎల్సీ ఆయకట్టును స్థిరీకరించాలి – గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు త్రాగునీరు అందించాలని రాయలసీమ విద్యావంతుల వేదిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఏపీ ఎమ్మార్పీఎస్, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్, రైతు కూలి సంఘం వివిధ ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గోనెగండ్ల లోని ప్రధాన వీధుల గుండా వెళుతూ మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం మండల తహాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ జిల్లా విద్యావంతుల వేదిక కన్వీనర్లు పాణి, బజారప్ప, సభ్యులు నాగన్న, ప్రజా సంఘాల ఐక్యవేదిక మండల కన్వీనర్ ఎస్ఎన్ మాబు వలి, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షురాలు జయమ్మ లు మాట్లాడుతూ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం కరువు వలసలకు నిలయంగా మారిందని తుంగభద్ర ఎల్ఎల్సి పక్కనే పారుతున్న గోనెగండ్ల మండలానికి త్రాగు సాగునీరు సమస్య అధికంగా ఉందని ముఖ్యంగా ఎల్ఎల్సీ ఆయకట్టు చివర ఉండే గోనిగండ్ల మండలంలోని గ్రామాలలోని ప్రజలు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తుంగభద్ర నది లో పుష్కలంగా నీరు ఉన్న ఎల్ఎల్సీ కి కేటాయించిన 4టి ఎం సి నికర జలాలు కూడా ఆయకట్టు రైతులకు అందడం లేదని ముఖ్యంగా గోనెగండ్ల మండలంలో హంద్రీనది ప్రవహిస్తున్న అందుబాటులో నాలుగు టీఎంసీల ప్రాజెక్టు ఉన్నది చుట్టూ నీటి వనరులు ఉన్నా గోనెగండ్ల మండలానికి మంచినీరు కూడా దక్కడం లేదని వాపోయారు. అలాగే గాజులదిన్నే ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలోని హంద్రీ పరివాహక గ్రామాలైన ఎనకండ్ల, గంజల్ల, బైలుప్పల, అగ్రహారం, తెర్నేకల్లు గ్రామాలలో ఇప్పటికీ బోర్లలో ఫ్లోరైడ్ నీరు తప్ప మంచినీరు లేదని, అలాగే గాజులదిన్నె ప్రాజెక్టుకు దిగువ ప్రాంతమైన హెచ్ కైరవాడి గ్రామంలో ఇప్పటికీ ఫ్లోరైడ్ వాటర్ నీరే తాగి అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే హంద్రీ పరివాహక ప్రాంతానికి దిగువ ఎడమ ప్రాంతాలైన కులుమాల, పెద్దమరవీడు, చిన్న మరి వీడు, అలువాల, చిన్న నేలటూరు, పెద్ద నేలటూరు తదితర గ్రామాల రైతులు సాగునీరు లేక ఏటా వేసిన పంటలు ఎండిపోతున్నాయని,అలాగే ప్రతి వేసవి కాలంలో ప్రజలకు తాగునీటికి కటకట ఏర్పడుతుందని అన్నారు. కావున ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోతల పథకం ద్వారా తాగునీరు, సాగునీరు అందించాలని దిగువ ప్రాంతాలకు త్రాగునీరు సాగునీరు అందించి రైతులను ప్రజలను ఆదుకోవాలని అన్నారు. అలాగే గోనెగండ్ల మండలంలోని చిన్న మరివీడు గ్రామంలో ఊరంతా ఇంటింటి కొళాయిలు ఏర్పాటు చేశారు. కానీ ఎస్సీ కాలనీలో మాత్రం ఇప్పటివరకు త్రాగునీటి కొళాయిలు ఏర్పాటు చేయలేదని అన్నారు. ఇప్పటికైన గ్రామ సర్పంచ్ స్పందించి ఇంటింటి కోలాలు వేయించకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ మండల నాయకులు లోకేష్, ఏ పి ఎంఆర్పిఎస్ మండల నాయకులు మహదేవ, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రసాదు,జిల్లా కార్యదర్శి, కే ఎం డి హనీఫ్, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఏసేపు, ఏ ఐ ఎఫ్ టి యు జిల్లా కన్వీనర్ సంజీవ, ఎల్ ఎల్ సి రైతులు వెంకటేశ్వర్లు, అద్దప్ప,ఓబులేసు, మునెప్ప, తిమ్మారెడ్డి ,చెన్నకేశవ గౌడ్, అశోక్, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు సన్నకి కర్రన్న, మండల అధ్యక్షులు ఎర్రక్క, అగ్రహారం ,బైలుప్పల, గంజల్లా ,కులుమాల, పెద్ద నెల్లటూరు, పెద్దమరీ వి, చిన్న మరి వీడు, అలువాల, హెచ్ కైరవాడి తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.

About Author