NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ మంత్రి అనిల్ యాద‌వ్ కు లోన్ యాప్ ఏజెంట్ ఫోన్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : లోన్‌ రికవరీ కోసమంటూ తాజా మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌కు ఓ ఏజెంటు ఫోన్‌చేయడం కలకలం సృష్టించింది. నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయరావుకు అనిల్‌ ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టారు. చెన్నైలోని కోల్‌మాన్‌ సర్వీసెస్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాకింగ్‌లకు లోను రికవరీ ఏజెన్సీగా పనిచేస్తోంది. నెల్లూరు రామలింగా పురానికి చెందిన ఓ ఫైనాన్స్‌ సంస్థ పాతపాటి అశోక్‌కుమార్‌ అనే వ్యక్తికి రూ.8.5 లక్షలు రుణమిచ్చింది. అతను తిరిగి చెల్లించకపోవడంతో కోల్‌మాన్‌ ఏజెన్సీకి అతడి ఫోన్‌ నంబర్‌ ఇచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం మాజీమంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌కు ఏజెన్సీ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘‘పాతపాటి అశోక్‌కుమార్‌ అనే వ్యక్తి రూ.8.5లక్షలు రుణం తీసుకున్నాడు. ఆ రుణం అతడు చెల్లించడం లేదు. కాబట్టి మీరే జమ చేయాలి’’ అంటూ ఫోన్‌లోనే అనిల్‌పై ఒత్తిడి తెచ్చారు. తాను నెల్లూరుకు చెందిన ఎమ్మెల్యేను అని చెప్పినా అవతలి ఏజెంటు తగ్గలేదు. దీంతో ఏజెంటుపై ఫోన్‌లోనే కొంత సీరియస్‌ అయిన అనిల్‌, అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

                                                

About Author