PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్థానిక సంస్థల ఎన్నికల సమీక్ష సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారి స్వగృహం నందు ఉమ్మడి కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లో భాగంగా నియోజకవర్గ ZPTC,ఎంపీటీసీ ప్రజా ప్రతినిధులతో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా ఉమ్మడి జిల్లా వైఎస్సార్ పార్టీ కొ ఆర్డినేటర్ రామ సుబ్బారెడ్డి గారు ,ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ మధు సుధన్ గారు ,జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్ర బోతుల పాపిరెడ్డి గారు,అవుకు మండల ZPTC చల్లా శ్రీ లక్ష్మీ ,అవుకు మాజి సర్పంచ్ దుగ్గిరాల రవీంద్ర రెడ్డి,అవుకు మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి ,కర్నూల్ 41 వ కార్పొరేటర్ శ్వేతా రెడ్డిలు హాజరు అయ్యారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ ఈనెల 13వ తేదీన ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఆరోజు బనగానపల్లె నియోజకవర్గం లోని జడ్పిటిసిలు ఎంపీటీసీలు అందరూ తమకు కేటాయించిన పోలింగ్ బూతు లలో వారికి ఓటు వేసి వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునివ్వడం జరిగింది. స్థానిక ఎంపిటిసి జడ్పిటిసి లో కొలిమిగుండ్ల, సంజామల మండల ప్రజా ప్రతినిధులు నంద్యాల లలో బనగానపల్లె, కోవెలకుంట్ల అవుకు మండల ప్రజాప్రతినిధులు డోన్ లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది.స్థానిక సంస్థల ఉమ్మడి జిల్లాల వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ రావు గారు మాట్లాడుతూ తనమీద ఎంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని జిల్లాలోని మొట్టమొదటిగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభలు కాటసాని రామిరెడ్డి గారు తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగిందని అందులో భాగంగానే ఈరోజు బనగానపల్లె నియోజకవర్గ జడ్పిటిసి ఎంపిటిసి లను కలిసి తమకు ఓటు వేయవలసిందిగా అభ్యర్థించడం జరిగిందని చెప్పారు.జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబాతుల పాపి రెడ్డి గారు మాట్లాడుతూ మన ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల అభ్యర్థి అయిన డాక్టర్ మధుసూదన్ గారిని అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న వెన్నపూస రవీంద్రారెడ్డి గారిని అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిడాక్టర్రామచంద్రరెడ్డిగారినినియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు పట్టపద్రులు ఉపాధ్యాయులు అందరూ తమ ఓటు హక్కును పాల్గొని వారి వారి ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ తీసుకురావాలని చెప్పారు.ఈ సందర్భంగా ఆవుకు మండల జడ్పిటిసి చల్లా శ్రీ లక్ష్మీ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో అభ్యర్థులను నిలబెట్టడం జరిగిందని వారికి బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ నాయకుడు అత్తర్ జాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ టిడిపి పార్టీ కుళ్ళు కుతంత్రాలతో నిండి ఉందని వారికి ఈ ఎన్నికలో ఒక చెంపపెట్టు లాంటిదని కాబట్టి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి గారిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగనన్నకు కానుకగా ఇవ్వాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులు కాటసాని ఓబుల్ రెడ్డి గారు, అవుకు మండలం వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి గారు, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు గుండం నాగేశ్వర్ రెడ్డి గారు, కోయిలకుంట్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బివి నాగార్జున రెడ్డి గారు, ఉమ్మడి జిల్లాల ఎంపిటిసి సంఘం జిల్లా అధ్యక్షుడు గోపవరం గోపి రెడ్డి గారు, కోవెలకుంట్ల పట్టణ ఉపసర్పంచ్ జిసిఆర్ సూర్యనారాయణ రెడ్డి గారు, బనగానపల్లె మండలం ఎంపీపీ మానసవీణ గారు, బనగానపల్లె నియోజకవర్గం లోని బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల, సంజామల, కోవెలకుంట్ల మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author