ఆ పరిస్థితి వస్తేనే లాక్ డౌన్ !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన కేసులు దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముంబయి, ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించింది. అయితే.. ముంబయిలో రోజూవారీ కేసులు 20 వేలు దాటితే లాక్ డౌన్ విధిస్తామని ముంబయి మేయర్ కిశోరీ పెడ్నేకర్ వెల్లడించారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముంబయిలో సోమవారం ఎనిమిది వేల కొత్త కేసులు నమోదయ్యాయి. గత ఏప్రిల్ 18 తర్వాత అత్యధిక రోజువారీ కరోన కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం.