తమిళనాడు లాక్ డౌన్: స్టాలిన్ నిర్ణయం
1 min readపల్లెవెలుగు వెబ్: తమిళనాడు రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. ఈనెల 10 నుంచి 24 వరకు పూర్తీ స్థాయి లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కరోన కట్టడి దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిత్యావసరాలకు మధ్యాహ్నం 12 వరకు అనుమతి ఉంటుంది. లిక్కర్ దుకాణాలను పూర్తీగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. రెస్టారెంట్లలో పార్శిల్ సదుపాయం కలదు. పెట్రోల్ బంక్ లు తెరిచే ఉంటారని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఎన్నికల అనంతరం నూతన ముఖ్యమంత్రిగా ఎం.కె. స్టాలిన్ శుక్రవారం ప్రమాణం తీసుకున్నారు. కరోన కేసుల ఉదృతి తగ్గించేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు.