లాక్ డౌనే మార్గం: రాహుల్ గాంధీ
1 min readపల్లెవెలుగు వెబ్: కరోనతో పోరాడాలంటే లాక్ డౌన్ పెట్టడమే సరైన మార్గమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రప్రభుత్వం కరోన కట్టడిలో పూర్తీగా విఫలమైందని ఆరోపించారు. కరోన మహమ్మారిగా మారడానికి కేంద్ర ప్రభుత్వం చేతగానితనమే కారణమని విమర్శించారు. కరోన నియంత్రణకు ఏకైక మార్గం లాక్ డౌన్ అని ఆయన అన్నారు. లాక్ డౌన్ విధించి, కరోన బారినపడ్డవారికి రక్షణ కల్పించడమే మార్గమని ఆయన తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని విమర్శించారు. వైరస్ కట్టడి చేయలేని స్థాయికి చేరడానికి కేంద్ర ప్రభుత్వమే ఒకరకంగా కారణమని ఆయన అన్నారు.