పశ్చిమ బెంగాల్లో లాక్ డౌన్
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. మే 30 వరకు పూర్తీస్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రేపటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. పరిశ్రమలు, అంతర్రాష్ట్ర రైలు సర్వీసులు, మెట్రో సర్వీసులు, బస్సులు పూర్తీగా నిలిపివేస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మతపరమైన సమావేశాలకు కూడ ఎలాంటి అనుమతి ఉండదని స్పష్టం చేసింది.
సీఎం సోదరుడి మృతి : పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సోదరుడు ఆశిమ్ బెనర్జీ కోవిడ్ సంబంధిత సమస్యలతో శనివారం ఉదయం మరణించారు. ఇటీవలే ఆయన కరోనబారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.