లాక్డ్ సెకెండ్ సీజన్ వస్తోంది..
1 min read
సినిమా డెస్క్ : లాస్ట్ ఇయిర్ ఆహాలో ప్రసారమై మంచి ఆదరణ పొందిన సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ లాక్డ్. దీనికి సంబంధించి రెండో సీజన్ అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది. వైద్యశాస్త్రంలో కఠినతరమైన ఎన్నో కేసులకు పరిష్కారాలను సూచించిన గొప్ప న్యూరో సర్జన్ డాక్టర్ ఆనంద్ పాత్రలో సత్యదేవ్ నటించారు. సీజన్ 1లో చిన్న చిన్న దొంగతనాలు చేసే ముగ్గురు దొంగలు డాక్టర్ ఆనంద్ ఇంట్లోకి ప్రవేశిస్తారు. అక్కడ వారికి ఆనంద్ చీకటి ముసుగులో చేస్తున్న నేరాల గురించి తెలుస్తుంది. ఆ ఇంట్లోకి వెళ్లిన వాళ్లెవరూ బయటకు తిరిగి రాలేకపోతారు. అందరూ హతమవుతారు. అయితే తన పేరు ప్రతిష్టలను నాశనం చేయగల ఓ రహస్యాన్ని ఈ ప్రపంచానికి తెలియకుండా దాచేస్తాడు డాక్టర్ ఆనంద్. అదేమిటన్నది సెకెండ్ సీజన్ చూసి తెలుసుకోవాల్సిందే. లాక్డ్ సీజన్ 1ను డైరెక్ట్ చేసిన ప్రదీప్ దేవ కుమార్ సీజన్ 2ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ ‘లాక్డ్’ సీజన్ 2లో ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలెన్నో ఉండబోతున్నాయట. సత్యదేవ్, సంయుక్తా హెగ్డే, కేశవ్ దీపక్, శ్రీలక్ష్మి, బిందు చంద్రమౌళి తదితరులు నటించిన మొదటి సీజన్ పలు ట్విస్టులు, టర్న్స్ కారణంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే లాక్డ్ రెండో సీజన్లో కూడా వెన్నులో భయాన్ని కలిగించే ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయని ప్రొడ్యూసర్స్ చెబుతున్నారు. సత్యదేవ్ ఈ సీజన్‌తో తనని ఇష్టపడేవాళ్లకి మంచి విందే ఇవ్వనున్నాడన్నమాట.