లోకాయుక్త జస్టిస్ పి . లక్ష్మణరెడ్డికి ఫిర్యాదు
1 min read– పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిను నివేదిక కోరిన రాష్ట్ర లోకాయుక్త. పి. లక్ష్మణ రెడ్డి
పల్లవెలుగు వెబ్ ఉయ్యూరు: రాష్ట్రంలోని 400 మంది పంచాయితీరాజ్ శాఖ ఇంజనీర్లపై క్రమశిక్షణ చర్యలు కొరకు రాష్ట్రపంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ ను నివేదిక కోరుతూ రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి .లక్ష్మణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ జూలై 1 తేదీ చేసిన ఫిర్యాదు మేరకు ఉత్తర్వులు జారీ చేశారని ఆయన ఓ ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్రంలో 2018 -19 సంవత్సరం లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ నిధుల (ప్రత్యేక అభివృద్ధి నిధులు) తో రాష్ట్రంలో నిర్మించిన 232 సిమెంట్ రహదారులు ఇతర పనులలో నాణ్యతా లోపాలు ఉన్నట్లుగా గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ 400 మంది పంచాయితీ రాజ్ శాఖ ఇంజనీర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని 2 సంవత్సరాల క్రితమే ప్రభుత్వానికి నివేదిక సమర్పించినా, ఆ 400 మంది ఇంజనీర్లపై ఇప్పటివరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోనందున, ఈ విషయంపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ తగు చర్యలు తీసుకోగలందులకు లోకాయుక్త జస్టిస్ పి . లక్ష్మణరెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగిందని ,సెప్టెంబర్ 27 లోపు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి తన నివేదికను సమర్పించాల్సి ఉందని, సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ఒక ప్రకటనలో తెలియజేశారు.