కృష్ణాజిల్లా కలెక్టర్ ని నివేదిక కోరిన లోకాయుక్త: జంపాన
1 min readపల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు: గత 100 సంవత్సరాలుగా స్మశాన భూమిలేని కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం ఆనందపురం దళితవాడ సమస్యపై కృష్ణా జిల్లా కలెక్టర్లును నివేదిక కోరుతూ రాష్ట్ర లోకాయుక్త పి .లక్ష్మణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఉయ్యూరు కృష్ణాజిల్లా ఉయ్యూరు కు చెందిన సామాజిక కార్యకర్త జంపానశ్రీనివాస్ గౌడ్ ఈ సంవత్సరం మార్చి 28వ తేదీ రాష్ట్ర లోకాయుక్త కు చేసిన ఫిర్యాదు పై లోకయుక్త ఉత్తర్వులు జారీ చేశారు. . కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం మండలం గండిగుంట గ్రామ శివారు ఆనందపురం దళితవాడలో 250 కుటుంబాల వరకు నివాసం ఉంటున్నారు. ఆనందపురం దళితవాడలోని 250కుటుంబాలు గత100 సంవత్సరాలుగా ఆనందపురం దళితవాడలో స్మశాన భూమి లేదు. ఆనందపురంపక్కనే ఉన్న చిన ఓగిరాల రెవిన్యూ గ్రామ సర్వేనెంబర్ 5 లోని పుల్లేరు కాలువ కట్టను స్మశాన భూమిగా వినియోగిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ, చీఫ్ మినిస్టర్ఆఫీస్ నోట్ నెంబర్ 142/అడిషనల్ సెక్రటరీ (ఎం ఆర్) 2022 సెప్టెంబర్17వ, తేదీ ప్రకారం,కృష్ణాజిల్లా కలెక్టర్ ఉత్తర్వులు 2022 డిసెంబర్ 22వ తేదీన ప్రకారం ఆనందపురం దళితవాడకు స్మశాన వాటికకు భూమిని సేకరించి కేటాయించడానికి ఉయ్యూరు తహసిల్దార్ , మరియుఉయ్యూరు డే ఆర్ .డి. ఓ.కృష్ణాజిల్లా తగు చర్యలు తీసుకో గలందులకు, లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగింది. జూన్ 23 తేదీ లోపుగా నివేదిక సమర్పించవలసిందిగా లోకాయుక్త కృష్ణాజిల్లా కలెక్టర్ ను ఆదేశించడం జరిగిందిఅని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఓ ప్రకటనలో తెలియజేశారు.