PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సజ్జరైతును కలిసిన యువనేత లోకేష్

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం గణేకల్లు శివారులో యువనేత నారా లోకేష్ సజ్జచేలో దిగి రైతు కష్టాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రైతు గోళ్ల నాగరాజు తమ గోడు విన్పిస్తూ నాకు ఎకరన్నర పొలం ఉంది.నీటి సౌకర్యం లేకపోవడంతో ఆరుతడి పంటగా అరఎకరంలో సజ్జవేసి, మిగిలిన ఎకరం బీడుపెట్టాను.నా పొలంలో బోరు ఉంది కానీ ట్రాన్స్ ఫార్మర్ లేదు.కరెంటు ట్రాన్స్ ఫార్మర్ కోసం రూ.20వేలు డిడి కట్టి ఏడాది అయింది. ఎప్పుడు అడిగినా ఇంకా ఏడాది సమయం పడుతుందని చెబుతున్నారు.సుమారు 2కిలోమీటర్ల నుంచి రూ.60వేలు ఖర్చుపెట్టి వైరు లాక్కుని నీళ్లకోసం అవస్థలు పడుతున్నాను.అసలే వ్యవసాయం అంతంతమాత్రంగా ఉంటే, కరెంటు కనెక్షన్ కోసం నానా అగచాట్లు పడాల్సి వస్తోంది.
యువనేత లోకేష్ స్పందిస్తూ…
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల పుణ్యమా అని వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది.మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగించాలని చూస్తున్నాడు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ట్రాన్స్ ఫార్మర్ ఇప్పించే ఏర్పాటుచేస్తాం.

About Author