జనసేన నేతల అరెస్టును ఖండించిన లోకేష్
1 min read
పల్లెవెలుగువెబ్ : విశాఖపట్టణం విమానాశ్రయం వద్ద నిన్న చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలు, ఆపై జనసేన నాయకులపై కేసులు, అర్ధరాత్రి అరెస్టులపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. విశాఖ విమానాశ్రయం ఘటన పేరుతో జనసేన నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. అరెస్ట్ చేసిన జనసేన నేతలు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ గదులను తనిఖీ చేయడం, అక్కడున్న నాయకుల విషయంలో అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.