లోకేష్‌కు ‘ముస్లిం’ పెద్దల ఆశీర్వదం..
1 min readఅధికారంలోకి వస్తే… సమస్యలు పరిష్కరిస్తామని హామీ..
పల్లెవెలుగు: కర్నూలు 48వడివిజన్ రోజాదర్గా వద్ద యువనేత నారా లోకేష్ ముస్లిం మతపెద్దలను కలిసి వారి ఆశీర్వచనం తీసుకున్నారు. రోజా దర్గాలోకి వెళ్లి మతపెద్దలకు అభివాదం చేసిన లోకేష్ ను వారు ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నారు.యువగళం పాదయాత్ర విజయవంతమయ్యేలా తనను ఆశీర్వదించాలని మతపెద్దలను లోకేష్ విన్నవించారు.రాబోయే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు సిఎం కావాలని అల్లాను ప్రార్థించాల్సిందిగా యువనేత మతపెద్దలను కోరారు.ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు యువనేతకు షాయా కప్పి ఫాతియా అందజేశారు.మసీదు నిర్వహణ, ముస్లిం సోదరులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై లోకేష్ వారిని అడిగి తెలుసుకున్నారు.టిడిపి అధికారంలోకి వచ్చాక మసీదులు, దర్గాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. చాలాచోట్ల ఖబరిస్తాన్ లు ఆక్రమణలకు గురైన విషయం తన దృష్టికి వచ్చిందని, రక్షణగోడలు ఏర్పాటుచేసి వాటిని పరిరక్షిస్తామని లోకేష్ తెలిపారు.
లోకేష్‌కు… సమస్యల వెల్లువ..
దారిపొడవునా నిరుద్యోగ యువకులు, దివ్యాంగులు, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గీయులు, మైనారిటీలు, వివిధ బస్తీల వాసులు యువనేతను కలిసి తమ సమస్యలను విన్నవించారు. కర్నూలు బస్టాండు సమీపంలో దివ్యాంగ చర్మకారుడు నాగన్నను కలిసి ఆయన సమస్యలు తెలుసుకున్నారు. 43వవార్డులు పేదలు నివసించే కాలనీలోకి వెళ్లిన లోకేష్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు.కర్నూలు శ్రీనివాసనగర్ లోని స్టాంటన్ స్మారక తెలుగు బాప్టిస్ట్ చర్చిలో యువనేత నారా లోకేష్ ప్రార్థనలు చేశారు.పాదయాత్ర సందర్భంగా సందర్భంగా చర్చిలోకి వెళ్లిన లోకేష్ కు క్రిస్టియన్ మతపెద్దలు సాదరంగా ఆహ్వానం పలికారు.యువనేత చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలంటూ మతపెద్దలు ఈ సందర్భంగా ప్రార్థనలు చేశారుఅనంతరం లోకేష్ మతపెద్దల ఆశీర్వచనం తీసుకున్నారు.ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.నగరంలో శ్మశాన వాటిక సమస్య ఉందని వారు తెలుపగా, అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఈ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.శనివారం నాడు కర్నూలులో 7.5 కి.మీ. మేర సాగిన పాదయాత్ర ఎస్ టిబిసి గ్రౌండ్స్ కు చేరుకుంది. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1169.7 కి.మీ పూర్తయింది. కర్నూలు ఎస్ టిబిసి గ్రౌండ్స్ లో ఆదివారం ముస్లిం మైనారిటీ సోదరులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమంలో యువనేత పాల్గొంటారు.