PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లోకేష్ పాదయాత్రకు పోటెత్తిన జనం ..

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: యువగళం లోకేష్ పాదయాత్రకు జనం పోటెత్తారు. శనివారం యువనేత నారా లోకేష్ పాదయాత్ర పత్తికొండ నియోజకవర్గం లోకి సాయంత్రం ఐదు గంటలకు చేరుకోగా, టిడిపి అభిమానులు కార్యకర్తలు తండోపతండాలుగా కదిలి వచ్చారు. నారా లోకేష్ బాబుకు అడుగడుగునా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. లోకేష్ పాదయాత్రకు అభిమానులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. తుగ్గలి మండలం రాంపల్లి క్రాస్ రోడ్ వద్ద అశేష జనవాహిని మధ్య లోకేష్ పాదయాత్ర కొనసాగింది. అక్కడ జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనపై శంఖారావం పూరించారు. లోకేష్ బాబు టిడిపి హయాంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించారు. టిడిపి హయాంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగ ప్రాధాన్యత కల్పించామన్నారు. పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధికి టిడిపి కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి టిడిపి తోనే సాధ్యమన్నారు. జగన్ మోహన్ పాలన రాష్ట్రo దివాలా దిశగా సాగుతుందన్నారు. రాష్ట్రం అన్ని విధాలుగా వెనకబడిపోయిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి అవినీతి పాలనకు రోజులు దగ్గర పడ్డాయి, ఇక జగన్మోహన్ రెడ్డి తట్ట, బుట్ట సర్దుకోవాలని హితవు పలికారు. ఆయన పాలనలో ప్రజలు పూర్తిగా చితికిపోయారన్నారు. భూకబ్జాలు ఇసుక మాఫియా లిక్కర్ స్కాములు జగనాసురులు దోచుకు తింటున్నారని మండిపడ్డారు. ఆయన పాలన అంతానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని జగన్మోహన్ రెడ్డి కుట్రలను ప్రజలు తిప్పి కొట్టారన్నారు. మూడు రాజధానులు పేరిట రాష్ట్రాన్ని నట్టేట ముంచేందుకు జగన్మోహన్ రెడ్డి కుయుక్తులు పన్నారని అన్నారు. నవరత్నాల పేరిట ప్రజలను నమ్మించి మోసం చేశారని తెలిపారు. కనీస అవసరాల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుల పై భారం మోపారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యాన్ని కూలగొట్టేందుకు ప్రజలు సన్నద్ధం కావాలన్నారు. పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని తుగ్గలి మద్దికేర క్రిష్ణగిరి వెల్దుర్తి మండలాల నుండి టిడిపి అభిమానులు భారీగా పాదయాత్రకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అన్ని మండలాల టిడిపి నాయకులు బత్తిన వెంకటరాముడు రామానాయుడు తిరుపాలు ఏం అశోక్ కుమార్ సింగం శ్రీనివాసులు మీరా హుస్సేన్ రంగస్వామి రాజన్న యాదవ్ ధనుంజయ, గోవిందు గౌడ్ శ్రీనివాసులు గౌడ్ బీటీ గోవిందు తో పాటు కార్యకర్తలు టిడిపి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author