NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జంట హ‌త్యల బాధిత కుటుంబాల‌కు లోకేష్ ప‌రామ‌ర్శ

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌ర్నూలు జిల్లా గ‌డివేముల మండ‌లం పెస‌ర‌వాయిలో దారుణ హ‌త్యకు గురైన తెదేపా నేత‌లు నాగేశ్వర‌రెడ్డి, ప్రతాప‌రెడ్డి కుటుంబాల‌ను నారా లోకేష్ ప‌రామ‌ర్శించారు. తెలుగు దేశం పార్టీ కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయామ‌ని, బాధిత కుటుంబాల‌కు అండ‌గా ఉంటామని హామీ ఇచ్చారు. పెస‌రవాయి చేరుకున్న నారా లోకేష్ బాధిత కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. కుటుంబ స‌భ్యుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. గురువారం ఉద‌యం త‌మ చిన్నాన్న కొడుకు చిన్న క‌ర్మకు స్మశానానికి వెళ్లిన నాగేశ్వర‌రెడ్డి, ప్రతాప‌రెడ్డిల‌ను మాటు వేసి ప్రత్యర్థులు దారుణంగా హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నమైంది.


About Author