PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండ్లెం గ్రామరైతుల జలదీక్షకు లోకేష్ సంఘీభావం..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: తమ పొలాలకు సాగునీరు అందించాలని మండ్లెం గ్రామరైతులు చేస్తున్న జలదీక్షకు యువనేత లోకేష్ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా రైతులు తమ సమస్యను తెలియజేస్తూ… శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సర్వస్వం కోల్పోయిన మేం మెట్టభూములు సాగు చేసుకుంటున్నాం.రాయలసీమలోని ఎగువ భాగం, ఆంధ్రతీర ప్రాంత ప్రజలకోసం పొలాలు త్యాగంచేసిన మేం అన్యాయానికి గురయ్యాం.మండ్లెం, తంగెడంచ, భాస్కరాపురం గ్రామాల్లో 5వేల ఎకరాలకు గత 40ఏళ్లుగా సాగునీరు లేక మా ప్రాంతం ఎడారిగా మారింది.  పొలాలకు సాగునీరు లేక రైతులు, రైతుకూలీలు పొట్టకూటి కోసం వలసలు వెళ్తున్నాం.వలస బతకులతో మా పిల్లల విద్య, ఆరోగ్యం దెబ్బతింది. నిరక్షరాస్యత పెరిగిపోయింది. మా గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల పొలాలే అధికంగా ఉన్నాయి.వర్షాలపైనే ఆధారపడటంతో ఏడాదిలో ఒక పంట కూడా సరిగా పండటంలేదు. సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోయి కొందరు రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.సమస్య పరిష్కరిస్తామని చెప్పిన ప్రజాప్రతినిధులు ముఖం చాటేశారు.మా ప్రాంతంలో ప్రత్యేక ఎత్తిపోతల పథకం ఏర్పాటుచేసి ఆదుకోవాలి.మా గ్రామానికి సాగునీరు అందించేందుకు మీవంతు సహకారం అందించండి.

లోకేష్ మాట్లాడుతూ..

• కృష్ణానది చెంతనే ఉన్నా మండ్లెం ప్రాంత పొలాలకు సాగునీరు  ఇవ్వకపోవడం అన్యాయం.

• కరువుకోరల్లో చిక్కుకున్న రాయలసీమ రైతాంగంపై కనీస కనికరం లేని కఠినాత్ముడు జగన్మోహన్ రెడ్డి.

• జగన్మోహన్ రెడ్డి నిర్వాకం కారణంగా రైతుల ఆత్మహత్యల్లో ఎపి జాతీయస్థాయిలో 3వస్థానం, అప్పుల్లో మొదటిస్థానానికి చేరుకుంది.

• జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 3వేలమందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

• రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగన్ పాలనలో సీమప్రజలు వలసలు వెళ్లిన పరిస్థితి రావడం శోచనీయం.

• గత టిడిపి ప్రభుత్వం సీమ ప్రాజెక్టుల కోసం రూ.11,700 కోట్లు ఖర్చుచేశాం.

• వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించండి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఏడాదిలో మండ్లెం ప్రాంతంలో ఎత్తిపోతల పథకం ఏర్పాటుచేసి సాగునీటి సమస్య పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు.

About Author