NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలందరినీ చల్లంగా చూడు స్వామీ.. ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: దక్షిణ కాశీగా పేరొందిన రాయచోటి వీరభద్రుని బ్రహ్మోత్సవాలలో గురువారం ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ కమిటీ చైర్మన్ పోలంరెడ్డి రె విజయ,మున్సిపల్ వైస్ చైర్మన్ దశరధ రామి రెడ్డి,EO రమణా రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాంత్ రెడ్డి కి పూర్ణకుంభ స్వాగతం పలికారు. వీరభద్రస్వామి ,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు గావించారు.
లోక కళ్యాణం కోసం వీరభద్రుని కళ్యాణం…
స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి, కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న శ్రీకాంత్ రెడ్డివీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు జరిగిన వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో స్వామి అమ్మవార్లకు శ్రీకాంత్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. నందులమఠం శశిభూషణ సిద్ధాంతిగారి ఆచార్యత్వమున శ్రీకాంత్ రెడ్డి ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ సంధర్బంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ భక్తి శ్రద్దలతో వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతుండడం హర్షణీయమన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.ఆలయ అర్చకులకు,ఋత్వికులకు దీక్షా వస్త్రాలు అందించిన శ్రీకాంత్ రెడ్డివీరభద్ర స్వామి ఆలయ అర్చకులు,ఋత్వికులకు దీక్షా వస్త్రాలు అందచేశారు.స్వామి వారి సేవ చేసుకోవడం పూర్వ జన్మల పుణ్యఫలం అని అన్నారు.
బ్రహ్మోత్సవాలపై ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఆరా…
ఈనెల 15 నుండి ప్రారంభమైన వీరభద్రుని బ్రహ్మోత్సవాలపై ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఆరాతీశారు.అధికారులు, దాతలు, భక్తుల సహకారంతో బ్రహోత్సవాలను విజయవంతం చేద్దామన్నారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిప ల్ చైర్మన్ ఫయాజ్ బాష, వైస్ చైర్మన్లు దశరథ రామి రెడ్డి, ఫయాజుర్ రెహమాన్,కలెక్టర్ గిరీష సతీమణి స్నేహశ్రీ, డి ఆర్ ఓసత్యనారాయణ సతీమణి నాగహరిప్రియ, డి ఎస్ పి శ్రీధర్ సతీమణి సుమలత,జిల్లా దేవాదాయ శాఖాధికారి విశ్వనాధ్, హాబీబుల్లా ఖాన్, బేపారి మహమ్మద్ ఖాన్, ఫయాజ్ అహమ్మద్, ఉమాపతి రెడ్డి, ఆలయ ఈఓ రమణా రెడ్డి, కమిటీ సభ్యులు సురేష్, నాగభూషణం, రత్నాకర్ రెడ్డి, ప్రత్యేక కమిటీ శివ చరణ్, లక్ష్మీ వెంకట ప్రసాద్,మున్సిపల్ ఆర్ ఐ మల్లికార్జున, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

About Author