సత్య ధర్మాలకు ఆశ్రయమైనవాడు శ్రీరాముడు
1 min readడాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే
మారెళ్ళలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు
పల్లెవెలుగు వెబ్ తుగ్గలి: సత్యము, ధర్మము ఎవరు పాటిస్తారో వారిని మానవులే కాదు పశుపక్ష్యాదులు, సమస్త జీవకోటి కూడా ఆశ్రయించి ఉంటాయని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తుగ్గలి మండలం, మారెళ్ళ గ్రామంలోని శ్రీవీరాంజనేయ స్వామి దేవస్థానం నందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నాలుగు రోజుల ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసిన సందర్భంగా వారు ప్రారంభోపన్యాసం చేశారు. మొదటి రోజు ప్రముఖ ధార్మిక ప్రవచకులు డాక్టర్ తొగట సురేశ్ బాబు శ్రీమద్రామాయణంలోని ఆదర్శ జీవన విలువల గురించి వివరించారు. తదనంతరం స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుగుణావతమ్మ, సలహాదారులు యర్రం సుధాకర రెడ్డి, ధర్మ ప్రచార మండలి సభ్యులు ఎ.కోదండరాం, తలారి అంజి, మాజి ఎంపిటిసి ఈడిగ వెంకట రాముడు, భజన మండలి అధ్యక్షులు చాకలి పెద్దయ్య, నక్క శివశంకర్, మంకె.లింగన్న, వై.కౌలుట్ల, పి.రామాంజనేయులు, తలారి లక్ష్మీ నారాయణ, సుధాకర్, ఉపాద్యాయులు రవీంద్రనాధ్ ఇ.దృవమూర్తి, యం.పెద్దయ్య, భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.