క్రిప్టో కరెన్సీలో నష్టం.. వ్యక్తి బలవన్మరణం
1 min readపల్లెవెలుగు వెబ్: క్రిప్టో కరెన్సీలో నష్టం రావడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలోని సూర్యపేటలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మం పట్టణానికి చెందిన గుండెమెడ రామస్వామి క్రిప్టో కరెన్సీలో బాగా లాభాలొస్తాయని ఇద్దరి స్నేహితులతో కలిసి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. నష్టం రావడంతో మనస్థాపానికి గురయ్యాడు. సూర్యపేటకు వచ్చి ఓ లాడ్జిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. లాడ్జి గది నుంచి దుర్వాసన రావడంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తలుపులు పగలగొట్టి చూస్తే మృతదేహం కనిపించింది. ఆత్మహత్యకు గల కారణాలను రామస్వామి లేఖ రాశారు. భారత ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ నిషేధించాలని త్వరలో పార్లమెంట్ లో చట్టం చేయనుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ నష్టాల్లోకి వెళ్లింది. దాదాపు 25 శాతం క్రిప్టో కరెన్సీ పతనమైంది. దీంతో చాలా మందికి నష్టాలొచ్చాయి.