వివాహితకు ప్రేమ లేఖ ముమ్మాటికి తప్పే !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఓ మహిళకు సచ్చీలతే విలువైన ఆభరణమని, ప్రేమ పేరుతో వివాహమైన మహిళకు ప్రేమ లేఖ పంపడం ఆమెను అవమానించినట్టేనని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది. ఇలా చేయడం ఆమె నిబద్ధతను శంకించడమనేని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణలో హైకోర్టులోని నాగ్ పూర్ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. వివాహితకు ప్రేమ లేఖ పంపిన వ్యక్తికి 90 వేల జరిమానా విధించారు. అందులో 85 వేలు బాధిత మహిళకు పరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చింది. 2011లో జరిగిన ఘటన పై నాగ్ పూర్ లో అకోలాలోని సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. 2018లో సెషన్స్ కోర్టు నిందితుడికి రెండే ళ్ల కారాగార శిక్ష, 40 వేల జరిమానా విధించింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తు నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.