ప్రకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని కాపాడండి
1 min read– నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రమేష్ ప్రత్యేకతగా అభినందించారు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక కర్నూలు నగరంలోనిగాయత్రి స్టేట్ లో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చిన్నారులకు వన మహోత్సవం కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ఆర్ ఐ దుర్గ లక్ష్మి విచ్చేసి వన మహోత్సవం ప్రోగ్రామ్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ చిన్నారులకు చిన్నతనం నుంచే పర్యావరణ గురించి మెలుకువలు తెలియజేస్తూ పర్యావరణాన్ని కాపాడాలి , పర్యావరణంలో వచ్చే ప్రతి మార్పును గమనించాలి , భావితరాలకు అవసరమయ్యే భవిష్యత్తు మనుగడకు చెట్లు ఎంతో అవసరం అని తెలియజేసి ప్రతి విద్యార్థితో మొక్కలు నాటించడం జరిగింది. అనంతరం R I దుర్గ లక్ష్మి గారు మాట్లాడుతూ పర్యావరణం ప్రగతికి మెట్లు చెట్లను నాటడం వల్ల ఆక్సిజన్ మెరుగుపడుతూ ఓజోన్ పొర దెబ్బతినకుండా వాటి వల్ల ఏర్పడే సమస్యలకు పరిష్కారమే చెట్లను పెంచడం అని సందేశాన్ని చిన్నారులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ , టీచర్స్,చిన్నారులు పాల్గొన్నారు.