బంగాళఖాతంలో అల్పపీడనం.. అలర్ట్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : బంగాళాఖాతంలోని ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వద్ద అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న అన్నారు. ఇప్పటికే గాలులతో ఆ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఉందని తెలిపారు. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఏర్పడింది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.