బంగాళఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : పశ్చిమ మధ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో రేపు కోస్తాంధ్ర లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. సముద్రంలో అలజడి నెలకొందని, మత్సకారులు వేటకు వెల్లరాదని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.