PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్రాంతి పండుగ పురస్కరించుకొని లక్కీ డ్రా ఎంపిక

1 min read

ఎస్ ఆర్ షాపింగ్ మాల్ లో కొనుగోలు చేసిన వారికి

పదిమంది విజేతలకు 10 కేజీల వెండి బహుమతి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఏలూరు స్థానిక ఆర్ఆర్ పేటలో ఉన్న ఎస్ ఆర్ షాపింగ్ మాల్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంగళవారం నాడు అడిషనల్ ఎస్పీ ఎం జె వి భాస్కరరావు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ఇరువురి చేతుల మీదుగా పదిమంది విజేతలను లక్కీ డ్రా ద్వారా తీయడం జరిగింది. అనంతరం ఎస్ఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ బాల రెడ్డి మాట్లాడుతూ వినియోగిదారులకు షాపింగ్ మాల్ లో కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి  లాటరీ ద్వారా గెలుపొందిన 10మంది వినియోగదారులకు ఒక్కొక్కరకు కేజీ వెండిని బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సంక్రాంతి పండుగ రోజు అందరినీ ఒకే చోట చేర్చి గెలుపొందిన వినియోగదారులకు ఘనంగా సత్కరించి వినియోగదారులు గెలుచుకున్న బహుమతులు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు బ్రాంచ్ మేనేజర్ కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.

About Author