30న మధ్యాహ్న భోజనం బంద్
1 min read– వంట ఏజెన్సీ సహాయకుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న వంట ఏజెన్సీ సహాయకుల సమస్యల వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈనెల 30వ తేదీ సోమవారం చెన్నూరు మండల వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం నిలిపివేసి బంద్ చేస్తున్నట్లు వంట ఏజెన్సీ సహాయకులు మేరీ. లక్ష్మి పార్వతి. రత్నమ్మ. బాల సుబ్బమ్మ. లక్ష్మమ్మ. కాసిం బి తెలిపారు. చెన్నూరులో శనివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వంట ఏజెన్సీ సహాయకులకు 3000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. రెండువేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఈ వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటియుసి నాయకులు అనేకసార్లు జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లును చెల్లించడం లేదని వారన్నారు. మెస్ ఛార్జీలు పెంచాలని ప్రతి విద్యార్థికి రోజుకు ₹20వంతున కేటాయించాలన్నారు. అలాగే పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. వంట ఏజెన్సీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నెల 30వ తేదీన బంద్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్నామని మండల విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేసేందుకు కార్యాలయానికి వెళ్ళగా ఆమె అందుబాటులో లేరు అని తెలిపారు.