బఫెట్ తో భోజనం.. రూ. 148 కోట్లు !
1 min readపల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ ఇన్వెస్టర్ , బెర్క్ షైర్ హాత్వే అధినేత వారెన్ బఫెట్ తరచూ చారిటీ లంచ్ నిర్వహిస్తారు. వేలంలో ఈ అవకాశం దక్కించుకున్న వారు ఆ మొత్తాన్ని చారిటీగా డొనేట్ చేశారు. ఈసారి లంచ్ వేలంలో ఏకంగా 1.9 కోట్ల డాలర్లు (రూ.148 కోట్లు) పలికింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని చారిటీ గ్లైడ్ కోసం నిర్వహించిన ఈ వేలం పాట గత ఆదివారం 25 వేల డాలర్లతో మొదలైంది. రోజురోజుకూ పెరిగి చివరికి అత్యంత ఖరీదైనదిగా రికార్డులకెక్కింది.