హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్రగౌరవాధ్యక్షుడిగా మాధారపు అరుణ్‌కుమార్ ఎన్నిక
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు : దేశంలో హిందూ సాంప్రదాయ పద్ధతులను గౌరవించే ప్రతిఒక్కరూ హిందువేనన్నారు హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మహేష్ డేగల. ఆదివారం కర్నూలు నగరంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో హిందూ ఉపాధ్యాయ సమితి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహష్ డేగల మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా హిందూ ఉపాధ్యాయ సమితి పని చేస్తోందన్నారు. అంతేకాక హిందూ సనాతన ధర్మం, సంప్రదాయాలను గౌరవించే ఎవరైనా హిందువులేనన్నారు.
అనంతరం హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గా మాధారపు అరుణ్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత రాష్ట్ర సహధ్యక్షలు నడింపల్లి నాగరాజ శర్మ, మహేష్ డేగల గారు రచించిన 8 కోట్ల హిందువుల నరసంహారం పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ హిందూ ఉపాధ్యాయ సమితి విజయ నివేదికను సమర్పించారు. తదుపరి వక్తలు విశ్రాంత డైట్ కాలేజి ప్రిన్సిపాల్ విశాలాక్షమ్మ , TTD వెంకట రెడ్డి , హరి, వీరప్ప , మాతృశక్తి అధ్యక్షురాలు గీతా హిందు ప్రసంగించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి రవి ,రాష్ట్ర IT కార్యదర్శి చిన్నారెడ్డి జిల్లా అధ్యక్షుడు టైగర్ కేశవ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి దిన్నె విశ్వేశ్వరప్ప గారు.జిల్లా మహిళ అధ్యక్షురాలు పార్వతి, జిల్లా కార్యదర్శులు ఎల్లస్వామి, శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావు ,శిరీష, కోమలి,అభిలాష ,హిందూ బంధువులు సత్యనారాయణరావు గారు పాల్గొన్నారు.