వాస్కోడిగామా, అమరావతి ఎక్స్ప్రెస్ రైళ్లను మద్దికేర రైల్వే స్టేషన్లో ఆపాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం లోని మద్దికేర రైల్వే స్టేషన్లో అమరావతి ఎక్స్ప్రెస్ వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ రైళ్లను గతంలో మాదిరి ఆపాలని కేపిఆర్ మైత్రి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రామ్మోహన్ బుధవారం రైల్వే డిఆర్ఎం, వినయ్ సింగ్ కు వినతి పత్రం అందజేశారు. నూతనంగా వచ్చిన రైల్వే వినయ్ సింగ్ ను కలిసిన కేపిఆర్ మైత్రి చారిటబుల్ ట్రస్ట్ రామ్మోహన్, వారికి మొక్కలను అందజేసి శాలువాతో సత్కరించారు. కర్నూలు జిల్లా మద్దికేర రైల్వే స్టేషన్ నందు అమరావతి ఎక్స్ప్రెస్ మరియు వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ గతంలో ఇక్కడ ఆగేవని, ప్రస్తుతం ఈ ఎక్స్ప్రెస్ లో మద్దికేర రైల్వే స్టేషన్లో ఆపడం లేదని తెలిపారు. ఈ కారణంగా ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కావున అమరావతి వాస్కోడిగామా ఎక్స్ప్రెస్లను మరలా తిరిగి ఆపాలని ఎంతోమంది ప్రయాణికులు, విద్యార్థులు కోరుతున్నారని తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికి వెళ్లేందుకు ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అలాగే రాజధానికి వెళ్లేవాళ్లు,వలస కూలీలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే ఏకైక సంస్థ రైల్వే సంస్థ ప్రజలను దృష్టిలో పెట్టుకుని మద్దికేర రైల్వే స్టేషన్ నందు ఈ రెండు ఆపేలాగా చర్యలు తీసుకోవాలని రైల్వే డిఆర్ఎం ను ఆయన కోరారు.