PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మద్దిలో ఉత్తర ద్వార దర్శనం..

1 min read

భక్తులతో కిటకిటలాడిన దేవస్థాన ప్రాంగణం

భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పర్యవేక్షణ

ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆకుల కొండలరావు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భముగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మరియు పట్టణం లో వేంచేసియున్న శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయములో ఉత్తరద్వార దర్శనం ఉదయం గం.05.00 ల నుండి  ప్రారంబించి భక్తులకు ఉత్తరద్వారం ద్వారా శ్రీ స్వామి వారి దర్శనం ఏర్పాటు చేయుట జరిగింది. అదే విధముగా శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం నందు కూడా ఉదయం గం.05.00ల నుండి భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేసియున్నారు. భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం ముక్కోటి సందర్భముగా శ్రీ సీతారామ స్వామి వారి దేవాలయములో ఈ రోజు ఉదయం గం.06.00ల నుండి రేపు ఉదయం గం.06.00ల వరకు అఖండ నామ సంకీర్తనతో ఏకాహo భజనా కార్యక్రమం ప్రారంభిచబడినది. అదే విధముగా గురవాయిగూడెం గ్రామం నందు స్వయంభుఃలై వేంచేసియున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు శ్రీ స్వామి వారికి ఉపాలయం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఉదయం గం.06.00ల నుండి  భక్తులకు  ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాట్లు చేసియున్నారు. శ్రీ స్వామి వారి దర్శనమునకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కూరగంటి రంగారావు మరియు జంగారెడ్డిగూడెం గ్రూపు దేవాలయముల సిబ్బంది తగు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలోతెలియజేసినారు.

About Author