అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నారు !
1 min readపల్లెవెలుగువెబ్ : సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ సీఎం జగన్ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకున్నారని, ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘విశాఖను సినిమా హబ్‌గా తయారు చేస్తామని సీఎం జగన్ అన్నారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ ఎలా అయితే అభివృద్ధి చెందిందో ఏపీలో కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడతాం అని సీఎం జగన్ అన్నారు. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలకు మంచి ఆదరణ వస్తోంది. ఏ సమస్య వచ్చినా సామరస్యంగా పరిష్కరించుకుంటాం. ఈనెల చివర్లో జీవో వచ్చే అవకాశం ఉంది. సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రత్యేక శ్రద్ద వహించిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నానికి ధన్యవాదాలు’ అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.