అధ్వానంగా మాధవరం తండా రోడ్డు
1 min read
ఎక్కడ పడితే అక్కడ రోడ్డు ను తవ్వుతున్న రైతులు
గుంతలు మయంగా మారిన రోడ్డు
ఇబ్బందులు పడుతున్న వాహన దారులు
పట్టించుకోని అధికారులు
మంత్రాలయం న్యూస్ నేడు : ప్రభుత్వాలు మారినా బాగుపడని రోడ్లు. అధ్వానంగా మారిన ఇలాంటి రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరీ చేయాల్సిన పరిస్థితి. గిరిజన గ్రామాలను అభివృద్ధి చేస్తామని నాయకులు ఎన్నికల సమయంలో హామీలు ఇస్తారు. తరువాత పట్టించుకునే వారు ఉండరు. ఈ రోడ్లపై వాహన దారులు కింద పడి ఆసుపత్రి పాలవుతున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మంత్రాలయం మండలం మాధవరం తండా గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారిందని ఇలా ఉంటే ఎలా వాహనాలలో ప్రయాణం చేయాలని ప్రజలు అంటున్నారు. ఈ గ్రామంలో 160 గిరిజన ఇళ్లు ఉన్నాయి. 15 వందల జనాభా ఉంది. 450 ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామానికి వెళ్లాంటే మాధవరం నుండి 6 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కు వెళ్లాలంటే రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఉన్న రోడ్డు ను కొంత మంది రైతులు అడ్డంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు ను తవ్వడంతో గుంతలమయంగా మారింది. దీంతో నరకయాతన అనుభవిస్తునట్లు తెలిపారు. రోడ్డు పై గుంతలు పడడంతో ఈ నెల 8 న కోసిగి మండలం పెద్ద భూంపల్లి గ్రామానికి చెందిన యలకాటి విష్ణు అనే యువకుడు ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. గర్బవతులు, బాలింతలు కూడా ఈ రోడ్డు పై వెళ్లాంటే నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామ మీదుగా పెద్దబొంపల్లి, చిన్న బొంపల్లి, శ్రావణమాసం లో ఉరుకుంద పుణ్యక్షేత్రం కు వెళ్తారని ఇబ్బందులు పడుతున్న సంబంధిత పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల లోనే ఉరుకుందు శ్రావణమాసం ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాధవరం తండా రోడ్డు ను తవ్వుతున్న రైతులపై చర్యలు తీసుకుని రోడ్డు ను బాగు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు గిరిజనులు కోరుతున్నాను.
