NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్.సి.యం విచారణ గురువుగా మధుబాబు

1 min read

-శ్యామ్ కుమార్ బ్రహ్మం గారి మఠం నకు బదిలీ

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని ఉప్పలదడియ ఆర్సిఎం విచారణ గురువులుగా డి. మధుబాబు బాధ్యతలు చేపట్టారు.ఫాదర్ మధుబాబు గుంటూరు జిల్లా ఉప్పుమాగులూరు విచారణ గురువులుగా ఉంటూ ఇక్కడికి బదిలీపై వచ్చారు.ఇక్కడ విచారణ గురువుగా ఉన్న జి. శ్యాం కుమార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం విచారణ గురువుగా బదిలీ అయ్యారు.నూతన గురువు మధుబాబుకువిచారణ గురువుగా శ్యామ్ కుమార్ గారు బాధ్యతలు అప్పజెప్పారు.ఉప్పలదడియ దేవాలయంలో మరియు 49 బన్నూరులో ఆర్ సి ఎం సంఘస్తులు ఇద్దరి గురువులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈరెండు గ్రామాలలో విచారణ గురువులు దివ్య బల్బుజను సమర్పించి వాక్య పరిచర్య చేశారు.ఈకార్యక్రమంలో పౌలయ్య,మాజీ సర్పంచ్ సారమ్మ, ఏసన్న,సామెల్,సతీష్,డేవిడ్,రత్నం,హరి,దాసు మరియు ఉపదేశులు సంఘ పెద్దలు మహిళలు 10 గ్రామాల ప్రజలు  పాల్గొన్నారు.

About Author