యువనేతను కలిసిన మాదిగ సామాజికవర్గీయులు
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైల నియోజకవర్గం వెలుగోడు చర్చివద్ద నంద్యాల జిల్లా మాదిగ సేవాసంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఎస్సీ వర్గీకరణ చేసి మాకు న్యాయం చేయండి. 2012 కురుక్షేత్రంలో మాపై పెట్టిన కేసులు ఎత్తివేయండి.జిఓ నెం.25 ప్రకారం మాకు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చుచేయాలి.ఎస్సీలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.దళితమహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నివారించాలి.దళితల విద్యాభివృద్ధికి ఉపకరించే పథకాలను ప్రవేశపెట్టాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దళితులకు చెందాల్సిన రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి తీరని ద్రోహం చేశారు.గత ప్రభుత్వంలో ఎస్సీల సంక్షేమానికి ప్రవేశపెట్టిన 27 సంక్షేమ పథకాలను జగన్ రద్దుచేశారు.దళితుల విద్యాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్, అంబేద్కర్ విదేశీ విద్య, అంబేద్కర్ స్టడీసర్కిల్స్ ను జగన్ రద్దుచేశారు.జగన్ అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడూ లేనివిధంగా దళితులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి.కాకినాడలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు దారుణంగా హత్యచేసి డోర్ డెలివరీచేస్తే, వైసిపి నేతలు ఊరేగించారు.ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో దళితమహిళ నాగమ్మను దారుణంగా హతమార్చారు.టిడిపి అధికారంలోకి వచ్చాక మాదిగలకు సామాజిక న్యాయం చేస్తాం.ఎస్సీలపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠినంగా శిక్షిస్తాం.జగన్ ప్రభుత్వం రద్దుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం.