ఎస్సీ వర్గీకరణతోనే మాదిగల అభివృద్ధి సాధ్యం..
1 min read– రాజ్యాంగ బద్దంగా వర్గీకరణ జరగాలి.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాజ్యాంగ ప్రకారం ఎవరి జనాభా దామాషా ప్రకారం వారు విడిపోతే తప్పేంటి ఎస్సీ వర్గీకరణ జరగకపోవడంతో మాదిగల ఎస్సీ లోని 59 ఉపకులాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనీ ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు ప్రేమ రాజ్, విజ్జి మాదిగ అన్నారు. గురువారం నందికొట్కూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు ప్రేమ రాజు మాదిగ విజ్జి మాదిగలు మాట్లాడుతూ ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ గ విడిపోలేదా తెలుగువాళ్లంతా కలిసి ఉన్నట్లు రిజర్వేషన్ వల్ల ఎవరికి హక్కులు వారికి ఉన్నప్పుడు దళితులంతా కలిసి మెలిసి ఉంటారన్నారు. ఈ విషయాన్ని అంబేద్కర్ వారసులుగా చెప్పుకుంటున్న వారు అర్థం చేసుకోవాల న్నారు. ఒక కుటుంబంలో అన్నదమ్ములుగా విడిపోతున్నప్పుడు 59 కులాలు వారి వారి వాట తీసుకుంటే తప్పేంటో అంబేద్కర్ వారసులమని చెప్పుకునే వారు సమాధానం చెప్పాలన్నారు. నందికొట్కూరు పర్యటనలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాట వాస్తవం. సుప్రీంకోర్టు వర్గీకరణ రద్దు చేయలేదు కానీ ఆర్డినెన్స్ ద్వారాకాకుండా చట్టసభల ద్వారా ఆమోదం పొందాలని మాత్రమే చెప్పిందన్నారు. అప్పటి టిడిపి ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడం ద్వారా మాదిగలు 2000 సంవత్సరం నుండి 2004 వరకు 22 వేల ఉద్యోగాలు పొందిన మాట వాస్తవం కాదా అన్నారు. ఈ లెక్కలు కేంద్రంలో ఉన్న అప్పటి యూ.పీ.ఏ .ప్రభుత్వం వేసిన ఉషా మెహర కమిషన్ నివేదిక ద్వారా తేటతెల్లమైందనీ కావున దళితులమైన మనం అన్నదమ్ములుగా విడిపోదాం దళితులుగా కలిసిందామన్నారు. ఈ కార్యక్రమంలో మిడుతూరు మండల నాయకులు డాన్ శీను స్వాములు రాజేష్ వెంకటేశ్వర్లు శేషన్న,ఎసన్న.రాము.నాగేశ్వరరావు. వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.