నవంబర్ 11న మాదిగల విశ్వరూప మహాసభ విజయవంతం చేయాలి..
1 min read– లక్షలాదిగా మాదిగలు మరియు ఉప కులాలు తరలిరావాలని పిలుపు..
– శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : హలో మాదిగ ఛలో హైదరాబాద్ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరగబోయే విశ్వరూప మహాసభ జరుగ నున్నదని లక్షలాది మాదిగ ఉప కులాలు అందరూ కూడా తరలి రావాలని ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక నాయకులు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలొ పసుపులేటి చిన్ని బాబు మాదిగ మాట్లాడుతూ కృష్ణ అన్నతీసుకున్న కీలక నిర్ణయం వచ్చే శీతాకాల పార్లమెంట్టు సమావేశం లో ఎస్ సి వర్గీకరణకు చట్టపద కల్పించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 11వ తేదీనా హైదరాబాద్ లో జరబోయే విశ్వా రూప మహా సభకు లక్ష లది మాదిగలలు రావాలని పిలుపునిచ్చారని తెలిపారు. దాన్లో భాగంగా పాలకొల్లు నియోజకవర్గం పోడూరు గ్రామంలో పెనుమతం బండారు చెరువు గ్రామంలో కరపత్రం ఆవిష్కరణ చేసి ఇంటింటికి కరపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలొ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు దిగుమర్తి నాగరాజు, రామకృష్ణ , కొల్లి వెంకటరావు, జయరాజు, ప్రసాదు,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మరియు మహిళా నాయకురాలు పాల్గొన్నారు. మరియు ఎం ఆర్ పి ఎస్, ఎం ఎస్ పి నాయకులు పాల్గొన్నరని పసుపులేటి చిన్నిబాబు మాదిగ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రచార కార్యదర్శి మరియు పాలకొల్లు నియోజకవర్గం ఇంచార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు.