PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ్యాస్ట్రో రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

1 min read

సినిమా డెస్క్​: ఈ నెల నుంచి థియేటర్స్‌ ఓపెన్‌ చేస్తామని అంటున్నా.. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ‘నారప్ప’ను ఓటీటీలోనే రిలీజ్‌ చేశారు. కానీ ఈ నెల 23న పక్కాగా థియేటర్స్‌ తెరుస్తామంటున్నారు తెలంగాణ ఎగ్జిబిటర్స్‌. చిన్న సినిమాలైనా ఇష్క్‌, డియర్‌‌ మేఘ వంటివి థియేటర్లలోనే రిలీజ్‌ కోసం కాచుకున్నాయి. కాని కొన్ని పెద్ద సినిమాలు మాత్రం ఓటీటీ వైపే అడుగులేయడం చిత్రంగా ఉంది. ఈ క్రమంలో ఫస్ట్ లాక్ డౌన్ తర్వాత నెలరోజుల గ్యాప్ తో చెక్‌, రంగ్‌దే తన రెండు సినిమాలు థియేటర్‌‌లోనే రిలీజ్‌ అయ్యాయి. ఈసారి మాత్రం నితిన్‌ ఓటీటీకే మొగ్గు చూపాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘మాస్ట్రో’ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తయి రిలీజ్‌కి రెడీగా ఉంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. హాట్ స్టార్ ద్వారా దీనిని విడుదల చేయబోతున్నారట. అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ డిజిటల్ రిలీజ్ డీల్ ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ సినిమాని స్ట్రీమ్ చేయబోతున్నారట. అతి త్వరలో ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. నితిన్ సొంత బ్యానర్ లో తన తండ్రి సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ సూపర్ హిట్ థ్రిల్లర్ ‘అంధాధున్’కు ఇది రీమేక్‌. నితిన్ కి జంటగా నభా నటేష్ నటించింది. జిషు సేన్ గుప్తా, నరేష్, శ్రీముఖి, అనన్య, హర్షవర్థన్, శ్రీనివాసరెడ్డి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

About Author