PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈడీ క‌స్ట‌డీకి మాఫియా డాన్ సోద‌రుడు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అండ‌ర్ వ‌ర‌ల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్ర‌హీం సోద‌రుడు ఇక్బాల్ కస్కర్‌ను మనీ లాండరింగ్ కేసులో ఏడు రోజుల ఈడీ కస్టడీకి ముంబైలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు శుక్రవారంనాడు ఆదేశించింది. దీనికి ముందు దావూద్‌ పైన, ఆయన అనుచరులపైన నమోదైన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి థానే జైలులో ఉన్న ఇక్బాల్‌ను ఈడీ అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచింది. ఇక్బాల్ తరఫు న్యాయవాది సుల్తాన్ ఖాన్ తన వాదనలు వినిపిస్తూ, దావూద్ సోదరుడు అయినందునే తన క్లయింట్‌ను వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. దావూద్ దేశం విడిచి వెళ్లినప్పటి నుంచి అతనితో ఇక్బాల్‌కు ఎలాంటి సంబంధాలు లేవన్నారు.

                                      

About Author