విడాకులకు కారణమైన `మ్యాగీ` !
1 min readపల్లెవెలుగువెబ్ : మ్యాగీ నూడిల్స్ ఓ జంట విడాకులకు కారణమైంది. బళ్లారిలో జరిగిన ఈ ఘటనను మైసూరుకు చెందిన జడ్జి ఎమ్‌ఎల్ రఘునాథ్ ఇటీ వల వెల్లడించారు. ఈ తరం దంపతులు చిన్న విషయాలకే విడాకుల దాకా వెళ్తున్నారంటూ ఆయన బళ్లారిలో ఉండగా పరిష్కరించిన ఈ కేసును ఇటీవల ఓ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ఒక్క వంట రాదనే కాదు… ప్లేటుకు ఒక పక్క పెట్టాల్సిన ఉప్పుడబ్బాను మరోపక్క పెట్టారని ఒకరు, వెడ్డింగ్ సూట్ కలర్ బాగలేదని మరొకరు విడాకులు తీసుకున్నారని గుర్తు చేశారు.