వైభవంగా స్పటిక లింగం ప్రాణ ప్రతిష్ట
1 min read– పుష్పగిరి పీఠాధిపతుల శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకర భారతి స్వాములవారి చే ప్రతిష్ట
పల్లెవెలుగు ,వెబ్ చెన్నూరు: బ్రాహ్మణ వీధిలో వెలసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో కాశీ నుండి తీసుకువచ్చిన పవిత్రమైన స్పటిక లింగం ప్రాణ ప్రతిష్టను పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకర భారతీ స్వాముల వారి చేతుల మీదుగా మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. పీఠాధిపతులు వారి శిష్య బృందం. ఆంజనేయ స్వామి ప్రధాన వేద పండితులు గిరి స్వామి ఏకాంతంగా స్పటిక లింగ ప్రాణప్రతిష్ఠ వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. ఈశాన పూజ అభిషేక పూజలు నిర్వహించారు. స్పటిక లింగానికి ఈశాన్య శ్వర స్వామి అని పీఠాధిపతులు జగద్గురు శంకర భారతి స్వామి నామకరణం చేశారు. ప్రతిష్ట పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అనుమతిచ్చారు. బుధవారం తెల్లవారుజామున స్పటిక లింగం ఈశాన్య శ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు వేదపండితుల చేతుల మీదుగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈశాన్య స్వర స్వామి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు చంద్రమౌళీశ్వర స్వామి, గోపి, ఆనంద్ కుమార్ పలువురు కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.