PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామ స్వరాజ్యం తీసుకుని వచ్చే అధ్బుతమైన పథకం (MGNREGA)

1 min read

జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గ్రామంలోని ప్రజలు వలసలు వెళ్లకుండా గ్రామంలోనే ఉపాధి కల్పించి గ్రామ స్వరాజ్యం తీసుకుని వచ్చే అధ్బుతమైన పథకం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ (MGNREGA) పథకమని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు.లక్ష్మీపురం జగన్నాథగట్టు డిస్ట్రిక్ట్ కెపాసిటీ బిల్డింగ్ సెంటర్ నందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం శాఖ ఆధ్వర్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరమునకు పనుల ఎంపిక- పనుల ప్రణాళిక తయారీ కి సంబంధించి ఎపిడి, ఎపిఓ, ఈసి, టిఎ, సిఓసిఎ లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమములో  జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతిని పురస్కరించుకొని జాతిపిత మహాత్మా గాంధీకి, మన భారత దేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి  పూలమాలవేసి ఘననివాళులు  అర్పించారు. అనంతరం  జ్యోతి ప్రజ్వలన, ప్రార్థన గీతంతో  కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి లు పురస్కరించుకున్న శుభదినాన ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, కార్యక్రమాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేశారని మరి ముఖ్యంగా ఇందులో భాగ్యస్వామ్యం కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి  ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 2005 వ సంవత్సరములో  చట్టం రూపంలో అమలులోకి తీసుకొని వచ్చారని  పేర్కొన్నారు.  జాతీయ పథకాలలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ (MGNREGA) పథకం చాలా ముఖ్యమైన పథకమని ఎందుకంటే గ్రామంలోని ప్రజలు వలసలు వెళ్లకుండా గ్రామంలోనే ఉపాధి కల్పించి గ్రామ స్వరాజ్యం తీసుకుని వచ్చేంత అధ్బుతమైన పథకమని అన్నారు. అంతేకాక గ్రామాల్లో ఈ పథకం కింద ఎన్నో పనులు చేపట్టడం జరిగిందని, ముఖ్యంగా ఈ పథకం కింద చేపట్టిన ప్రతి పని ఉపయోగపడే విధంగా ఉండాలని పనులను ఎంపిక చేసే విషయంలో అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ లకు సూచించారు. కార్యక్రమానికి ముందుగా  ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా  రక్తదాన శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ ప్రారంభించిన అనంతరం రక్తదానం చేసిన డ్వామా సిబ్బందికి వాలంటరీ బ్లడ్ డొనేషన్ సర్టిఫికేట్ అందచేశారు. మెడికవర్  హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని జాయింట్ కలెక్టర్ బిపి టెస్ట్చే యించుకున్నారు. డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి  మాట్లాడుతూ ముఖ్యంగా ఈరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించిన ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే  గ్రామాలలో ఏ విధంగా గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవాలి, ఏ విధంగా పనులను గుర్తించాలి అనే దాని మీద ఉపాధి సిబ్బందికి శిక్షణ ఇవ్వడమే ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం ఉపాధి సిబ్బంది చాలా బాగా ప్రగతి కనపరచినందున అందుకు గాను డ్వామా సిబ్బంది 100 మందికి మెమెంటో, సర్టిఫికేట్ లు ఇస్తున్నామని జాయింట్ కలెక్టర్ కి వివరించారు. తదనంతరం  జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన డ్వామా సిబ్బందికి సర్టిఫికెట్, మెమెంటో  జాయింట్ కలెక్టర్ అందచేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డి, సిపిఓ అప్పలకొండ, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, డిఆర్డిఎ  పిడి నాగ శివలీల, డిఎఫ్ఓ శివశంకర్ రెడ్డి, డిపిఓ  నాగరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

About Author