శ్రీ బాలయ్యప్ప క్షేత్రంలో మహా అన్న సమారాధన..
1 min read– 5,000 మందికి భక్తుల సహకారంతో అన్నప్రసాద వితరణ..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : శ్రీ బాల అయ్యప్ప క్షేత్రం దొండపాడులో శుక్రవారం మహా కుంభాభిషేక సహిత, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పునం ప్రతిష్ట మహోత్సవం వేలాదిమంది భక్తుల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు, మార్చి 1వ తేదీ నుండి మూడో తేదీ వరకు కుంభాభిషేకం మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహికంగా నిర్వహించారు, గత 12 సంవత్సరాలగా ఆలయ నిర్మాణమునకు, శాశ్వత నిధికి, స్వాముల బిక్ష కార్యక్రమాలను విరివిగా విరాళాలు ఇచ్చి సహకరించిన దాతలు, గురు స్వాములు, భక్తులకు పేరుపేరునా కమిటీ వారు హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు, ప్రతినెల ఆలయ నిర్వహణకు సహకరిస్తున్న దాతలు. వ్యవస్థాపక ఆలయ ధర్మకర్త గుమ్మడిదల సీతారామయ్య (గురుస్వామి) గన్నె రామకృష్ణ వరప్రసాద్ శ్రీమతి విమల దంపతులు, బోల్ల వీర వెంకట సత్యనారాయణ రాణి, అక్కి శెట్టి పోతురాజు పుష్పావతి, కౌలూరి శ్రీనివాసరావు రాజేశ్వరి, దగ్గుమల్లి నాగ సుబ్బారావు వెంకట దుర్గా లక్ష్మి , కళ్యాణపు రంగారావు లక్ష్మి , కొమ్మారెడ్డి వెంకటేశ్వర్రావు నాగవల్లి, నాయుడు చెన్నారావు మంజుల, అడ్డాడ సురేష్ వర్మ మాధవి, అట్లూరి దుర్గ నాగేశ్వరరావు ఉమాదేవి, గుత్త శ్రీనివాసరావు కృష్ణకుమారి, యర్రా రాంబాబు మహాలక్ష్మి , బోనం సాయిరాం సత్యవాణి, పసుపులేటి త్రినాథ్ దంపతులు, ప్రశాంత్ రాధిక చౌదరి సహకరిస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపారు, ఆలయ కమిటీ వారు మరియు అధ్యక్షులు శ్రీ మణికంఠ సేవా సమితి వారు సహకరించిన భక్తులకు ,భక్త బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.