పెన్సిళ్ల పై మహాభారతం !
1 min readపల్లెవెలుగువెబ్ : పెన్సిళ్ల పై మహాభారతాన్ని లిఖించి రికార్డు సృష్టించింది అన్నం మహిత. సూక్ష్మకళపై మక్కువతో పెన్సిళ్ల పై మహాభారతాన్ని లిఖించింది. అన్నం మహిత స్వస్థలం ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామం. మహాభారతంలోని 18 పర్వాలను.. 700 శ్లోకాలను సంస్కృత భాషలో అవలీలగా లిఖించగలిగింది. ఇందుకు ఆమె 810 పెన్సిళ్లను ఉపయోగించింది. వాటిపై 67,230 అక్షరాలను, 7,238 పదాలను లిఖించింది. ఇందుకోసం పెన్సిళ్లను ముందుగా బద్దగా చీల్చి అందులోని లిడ్ 2 మిల్లీమీటర్ల మందం ఉండేలా చూసుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకోవడం లక్ష్యమని మహిత చెబుతోంది.