23న చేనేతల మహాధర్నా…
1 min readపల్లెవెలుగు వెబ్ : మానవుడి మానాన్ని కాపాడేందుకు పోగు పోగు నేసి బట్టలుగా మార్చిన చేనేతల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 23న విజయవాడలోని ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం నగరంలోని కలెక్టరేట్ ముందున్న గాంధీ విగ్రహం వద్ద చేనేతలు మహాధర్నాకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంగం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, మహాధర్నా నిర్వహణ కమిటీ కన్వీనర్ చింతా శ్రీనివాస్, రాష్ట్ర మహిళ నాయకురాలు శకుంతల, భావాసారా క్షేత్రియా రాష్ట్ర నాయకులు హెచ్ ర్ ఎస్ రావు, సంగం నాయకులు చంద్రసెఖర్, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.