డిమాండ్ల సాధన కోసం… 24న మహాధర్నా
1 min read– ఏపీ జేఏసీ సెక్రటరి జనరల్ జి. హృదయరాజు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: రాష్ట్రంలో ఆర్థిక, విద్యారంగంలో నెలకొన్న పలు సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ జేఏసీ సెక్రటరి జనరల్ మరియు APTF రాష్ట్ర అధ్యక్షుడు జి. హృదయ రాజు. బుధవారం సాయంత్రం కర్నూలు ఏ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్(ఆప్టా) జిల్లా కార్యాలయంలో FAPTO జిల్లా చైర్మన్ జె సుధాకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జి. హృదయరాజు మాట్లాడుతూ 1.7.2018 నుండి అమలు కావాల్సిన PRC నేటికీ 3 సం.లు పూర్తి అయినా ఊసెత్తకపోవడం దారుణమన్నారు. అధికారంలోకి వచ్చిన నెల లోపు CPS రద్దు చేస్తామని చెప్పి 27 నెలలు గడిచినా పట్టించుకోలేదని, సకాలంలో డి. ఏ లు ఇస్తామని చెప్పి 5 DA లు పెండింగ్ లో పెట్టడం ద్వారా రాష్ట్రంలోని ఉపాద్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్స్ పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం అర్థమవుతోందన్నారు.
అనంతరం రాష్ట్ర FAPTO కార్యదర్శి , కర్నూలు జిల్లా ఇంచార్జి మరియు ఆప్టా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్ రావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థుల హక్కులను అధికారులు కాలరాస్తూ.. పనివేళలు పెంచుతూ ఆదేశాలు జారీ చేయడం దారుణమన్నారు. ప్రాథమిక తరగతుల విభజను… ఉపాధ్యాయులు మరియు మేధావులు ప్రతిఘటిస్తున్న అధికారులు తమ పని తాము చేస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారం కోసం 24న చేపట్టే మహాధర్నాకు ప్రతి ఉపాధ్యాయుడు, హెచ్ఎంలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశములో జిల్లా నాయకులు సెక్రటరీ జనరల్ రంగన్న APTF 257, గోకారి STU, నారాయణHMA, మాధవ స్వామి APTF 1938,ఇస్మాయిల్ APTF1938, ఆనంద్ BTA, తిమ్మప్ప DTF, గోవింద్ నాయక్ STU, సుధాకర్ UTF మరియు మధుసూదన్ రెడ్డి APPTA పాల్గొన్నారు.